Now let us see the projects like Web- Series and Docu Dramas.
Bala Reddamma
భూమిపై నడయాడిన ఒక అద్భుతం
బాలరెడ్డమ్మ
మనిషి దేవత అవడమేంటి? భక్తి, పవిత్రత, త్యాగం అన్నికలగలిసిన ఒక చిన్న పాప దివ్యశక్తిగా మారింది. ఆమే బాలరెడ్డమ్మ. అసలది సాధ్యమేనా? అవును సాధ్యమే అంటూ నిరూపించిన మహిమాన్వితమైన, మహోన్నతమైన భక్తురాలు బాలరెడ్డమ్మ. ఇది పురాణ కాలపు కల్పితం కాదు. కేవలం మూడు శతాబ్దాల క్రితం, మన నేల మీద, మన ప్రజల మధ్యే పుట్టిన నిజ జీవిత గాథ.
పూర్వ చిత్తూరు జిల్లా, నేటి అన్నమయ్య జిల్లా, చెర్లోపల్లి సమీపంలోని కొండల మధ్య ఆవిర్భవించిన ఒక అమ్మాయి కథ ఇది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, దేవతగా మారిన బాలరెడ్డమ్మ ఆత్మగాధ మన భక్తి చరిత్రలో అక్షరాలుగా చెక్కబడింది. యెల్లంపల్లిలో రామిరెడ్డి, నాగమ్మ దంపతుల ముద్దుబిడ్డగా పుట్టిన బాలరెడ్డమ్మ అందరిలానే సాదాసీదా అమ్మాయి. కానీ మానవత్వం, వినయం, ధర్మం ఆమె జీవన మార్గం. ఒక అమాయకపు బాలికపై క్రూరపు దృష్టి పడిన రోజు. అదే రోజు భగవంతుడు ప్రత్యక్షమై ఆ పాపను తనలో కలుపుకున్న రోజు. అదే రోజు ఆ అమ్మాయి మానవ శరీరాన్ని వదిలి ప్రకృతి శక్తి గా మారిన రోజు.
ఉరుములు, మెరుపులు, భూకంపం మధ్య కొండ చీలి ఆమెను తనలో కలుపుకున్న క్షణం. బాలరెడ్డమ్మ, ఒక మానవురాలి నుండి దేవతగా మారిన భక్తి గాధ. తప్పకుండా భవిష్యత్ తరాలకు స్పూర్తిగాధగా మిగిలిపోతుంది ఈ మినీ చిత్రం.
భక్తికి, ముక్తికి పేరుగాంచిన
హేమారెడ్డి మల్లమ్మ
భారత భక్తి సంప్రదాయంలో స్త్రీ శక్తి ఎప్పుడూ పునీతమైన శక్తిగా నిలిచింది. ఆ శక్తి కొన్నిసార్లు మాతృత్వంగా వెలుగుతుంది, కొన్నిసార్లు భక్తి రూపంలో పరమాత్మతో ఏకమవుతుంది. అటువంటి ఆత్మలలో ఒక దివ్య రూపం హేమారెడ్డి మల్లమ్మ.
14వ శతాబ్దంలో శ్రీశైలం సమీపంలో ఉద్భవించిన మహిమాన్వితురాలు హేమారెడ్డి
మల్లమ్మ. చిన్న వయస్సు నుంచే ఆమెకు భక్తి శ్వాసగా మారింది. ఆమె ఆడిన పాటల్లో,
ఆమె నిశ్శబ్దంలో, ఆమె చూపులో కూడా “ఓం నమః శివాయ” అనిపించేది. మల్లమ్మ
శివుని కేవలం దేవుడిగా కాకుండా తన భర్తగా, తన ఆత్మస్వరూపుడిగా దర్శించింది.
అది ఒక భక్తి కాదు, అది ఆత్మానుభూతి. అది ఒక స్త్రీ ప్రేమ కాదు, అక్కడ ఆమె గోవులను
సేవిస్తూ, శివుడిని పాలతో అభిషేకిస్తూ శివుడినే భర్తగా తలచింది. ఆమె శ్వాస, భాష,
ఆశ అంతా శివుడే. అందుకే స్వయంగా మల్లికార్జున స్వామి ఆమె ముందు ప్రత్యక్షమై,
తనలో ఐక్యం చేసుకున్నాడు.
ఆ క్షణం భక్తి ముక్తిగా మారిన క్షణం. ఇప్పటికీ శ్రీశైల పర్వతాల అడుగున ప్రవహించే “మల్లమ్మ కన్నీరు వాగు” ఆమె దైవసాక్ష్యానికి చిహ్నం. అది కన్నీటి రూపంలో భక్తి ప్రవాహమై ప్రవహిస్తోంది. హేమారెడ్డి మల్లమ్మ భక్తి స్త్రీత్వానికి ప్రతీక. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆమె ఒక శాశ్వత జ్యోతి. ఆ జ్యోతి భక్తుల మనసులో నేటికీ వెలుగుతోంది. ఈ మినీ మూవీ, ఆమె దైవ భక్తి, ఆత్మసమర్పణ, మరియు శివపత్నీ భావం ప్రతిబింబం. హేమారెడ్డి మల్లమ్మ, ఒక స్త్రీ కాదు, ఒక స్ఫూర్తి.ఒక భక్తి కాదు, ఒక ఆత్మజ్యోతి.
Hemareddy Mallamma
Bhakta Malla Reddy
భక్తికి, ముక్తికి పేరుగాంచిన
హేమారెడ్డి మల్లమ్మ
భక్తికి, ముక్తికి పేరుగాంచిన
భూమిపై నడిచిన మానవ రూప దైవం, “భక్త మల్లారెడ్డి” గారు.
ఇది పురాణ గాధ కాదు. ఇది కాలాన్ని దాటిన నిజం. ఇది మన చరిత్రలో ముద్ర వేసిన భక్తి తత్త్వం. శివుని అనుగ్రహంతో పుట్టి, తన జీవితాన్ని మొత్తం జాతి చరిత్ర, కులగౌరవం, వంశ పరిరక్షణ కోసం అంకితం చేసిన ఒక మహానుభావుని గాధ ఇది. శ్రీశైల పర్వతాల ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆదిరెడ్డి వంశానికి జన్మించిన ఒక శిశువు, అతని ఎడమ చేయి లేక, కుడి పాదం లేక పుట్టాడు, కానీ ఆ లోపంలో దైవతత్వం నిండిపోయి ఉంది. ఆ శిశువే భవిష్యత్తులో “కుంటి మల్లారెడ్డి” కాదు, “భక్త మల్లారెడ్డి” అయ్యాడు.
తనకు జరిగిన అవమానాన్ని ఆయుధంగా మార్చుకున్న ఆయన, తన భక్తిని తన జ్ఞానంగా మార్చుకున్నాడు. తన తపస్సుతో శివుడిని సాక్షాత్కరించి, రెడ్డి జాతి పునాది అయిన వంశ చరిత్రను, గోత్ర సంప్రదాయాలను పునరుద్ధరించాడు. భూమి మీద నడిచే ప్రతి రెడ్డి కుటుంబానికి తమ మూలాలను, తమ గోత్రాన్ని, తమ పూర్వీకుల గౌరవాన్ని గుర్తుచేసిన వ్యక్తి, ఆయనే భక్త మల్లారెడ్డి. తన జ్ఞాపకశక్తితో లక్షల గోత్రాలు, శాఖలు, వంశవృక్షాలు కంఠాపాఠంగా ఉంచి,
ఊరు నుంచి ఊరికి తిరిగి, జాతికి చరిత్రను సజీవంగా మలిచాడు.
ఆయన బోధించిన మాట ఒకటి, "మన మూలాలను తెలుసుకోవడం అంటే మన ఆత్మను తెలుసుకోవడం.” ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది భక్తి, జ్ఞానం, వంశగౌరవం కలిసిన తత్త్వగాథ.
ఆయన భక్తి భూమి నలుదిశలా చేరింది., ఆయన జ్ఞానం తరతరాలను చైతన్యం చేసింది, ఆయన పేరు భక్త మల్లారెడ్డి. రెడ్డి జాతి యొక్క కులగురు, శివభక్తి మూర్తి, చరిత్ర సంరక్షకుడు. ఆయన గురించి రూపొందించబోయే చిరు చిత్రమే..
ఈ రెడ్డి జాతి కులగురువు, భక్త మల్లారెడ్డి.
అవధూత భగవాన్ శ్రీ కాశీ రెడ్డి నాయన - ధర్మ రక్షణకు అవతరించిన మహాత్ముడు
కాలం మారినా, ధర్మం నిలిచేది కాదు. సమాజం దారి తప్పినపుడు, పరమాత్మ భూమిపైకి అవధూత రూపంలో అవతరిస్తాడు. అలాంటి దివ్య అవతారమే భగవాన్ శ్రీ కాశీరెడ్డి నాయన. నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో, ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆ శిశువు, తల్లి తండ్రులు చిన్న వయసులోనే పరమపదించిన తర్వాత, జీవితం అనాధగా మొదలై, జాతి కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం మారింది. చిన్న వయసులోనే ఆయనలో భక్తి, ప్రశాంతత, ఆలోచన .. అన్నీ అసాధారణం. అతను కేవలం పండితుడు కాదు, ఆచరణలో మహానుభావుడు. శివభక్తి, గౌమాతా సంరక్షణ, అన్నదానం, దేవాలయ పునరుద్ధరణ. ఇవి ఆయన జీవితం యొక్క శ్వాసల వంటివి.
బావిలోని నీటి నుంచి వెలుగులో తేలుతూ కనిపించిన es క్షణం నుండి అతను ప్రజల కళ్ళలో మానవుడు కాదు, అవధూతుడు అయ్యాడు. “కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సుతో పుట్టిన వాడు”, అని అందరూ గుర్తించారు.
బావిలోని నీటి నుంచి వెలుగులో తేలుతూ కనిపించిన క్షణం నుండి అతను ప్రజల కళ్ళలో మానవుడు కాదు, అవధూతుడు అయ్యాడు.
“కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సుతో పుట్టిన వాడు”, అని అందరూ గుర్తించారు.
దేశమంతా తిరిగి, ఆయన స్థాపించిన ఆశ్రమాలు, అందరికీ ఆశ్రయాలయ్యాయి. ఆధ్యాత్మికతకి నెలవులయ్యాయి. ఆయన ప్రబోధాలు లక్షలాది మందికి జ్ఞానబాటలుగా మారాయి. ఇది ఆయన కథ. సంస్కృతికీ, భక్తికీ సంబంధించిన మినీ మూవీ కథ .
Kaashireddy Nayana
Yogi Vema Reddy
మహాతత్వవేత్త, ప్రజాకవి
బెదమ కోమటి చినవేమా రెడ్డి (యోగి వేమన)
సృష్టి మొదలయిన దగ్గర్నుండి మనిషి ఆలోచన మారుతూనే వుంది. ఆధునికత
పెరుగుతున్న కొద్దీ మనిషి ఆలోచన మారుతూనే వుంది. పద్దతులు మారుతున్నాయి.
కానీ కొన్ని తరాల నుండి మారనిది, పిల్లలకు నేర్పించడంలో మరిచిపోలేనిది,
ఎవ్వరూ విస్మరించని పేరు.. యోగి వేమన. అందుకే.. కాలం మారినా వేమన పేరు
మరిచిపోలేదు. తెలుగువాడి గడపగడప కూ వేమన సుపరిచితం. తెలుగు
నుడికారంలోనే ఇమిడిపోయిన పేరు యోగి వేమన. ఆయన చరిత్ర అపూర్వం.
చీకటిలో వెలుగు పూయించడం కాస్త కష్టపడితే సాధ్యమే. కానీ అదే వెలుగు
ప్రపంచానికి మొత్తం ప్రసరించాలంటే ఎంత మధనం కావాలి? ఎన్ని పోరాటాలు
చేయాలి? ఎన్ని మార్పులు రావాలి? .. అదిగో అన్ని పోరాటలు, అన్ని మార్పులు ఒక
మనిషిలో జరిగాయి. అతన్ని తత్వవేత్తగా మార్చాయి. ఆ తత్వవేత్త చూసిన భవిష్యత్
ఆ తత్వవేత్త ఆలోచించి పలికిన పలుకులు, ఇప్పటికీ ఎప్పటికీ నిజాలే. ఒక
యువరాజులా ఉండాల్సిన యువకుడిలో సముద్రం అంత మథనం. కనుసన్నలలో
రాజ్యంలో పనులు చక్కబెట్టే యువకుడిలో అంతర్మథనం ప్రపంచానికి
మేలుకొలుపైంది. చినవేమారెడ్డి అనే యువకుడు, రాజభవనపు సౌఖ్యాన్ని వదిలి
ఆత్మజ్ఞానం కోసం నడిచిన విధానం. వదిన నరసాంబ ..తల్లి ప్రేమతో మార్గం చూపిన
ఆత్మజ్యోతి. వేశ్య విశ్వద.. పాపం కంటే పశ్చాత్తాపం గొప్పదని నేర్పిన
అద్దం.అభిరామయ్య బ్రాహ్మణుడు.. జ్ఞానద్వారం తెరిచిన మంత్రోపదేశకుడు. అతని జీవితమంతా ఒక సత్యాన్వేషణ. మానవుడి లోపాల్ని చూసి, వాటిని సరిచేసే ప్రయత్నం చేశాడు. అతని పద్యం, అతని గళం, అతని జ్ఞానం, సమాజాన్ని కదిలించాయి.తనకు లభించిన జ్ఞానం అతని కోసం కాదు. అది ప్రజల కోసం. తన పశ్చాత్తాపం తత్వంగా మారింది, తన జీవితం “వేమన పద్యం"గా నిలిచింది. ఈ కథ, తెలుగు నేర్చుకున్న సి.పి.బ్రౌన్ గారికి వేమన పద్యాల మహత్యం తెలిసింది. ఆయనే పూనుకుని వేమన పద్యాలను సేకరించాడంటే, ఆ పద్యాలలో ఎంత మహిత్తు ఉందో అర్ధమవుతుంది. ఒక మనిషి అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు నడిచిన పయనం. ఇది కేవలం యోగి వేమన చరిత్ర కాదు, ప్రతి మానవుడు లోపల జరిగే యుద్ధానికి ప్రతిరూపం. ఇది మన అంతరాత్మలో వెలిగే జ్ఞానజ్యోతి కథ. ప్రపంచ వ్యాప్తంగా తత్వవేత్త అంటే సోక్రటీస్ పేరు వినిపిస్తుంది. కానీ తెలుగువాడి చరిత్ర నేల నాలుగుచెరుగులా పెరిగిన ఈ తరుణంలో సోక్రటీస్ కంటే ముందు వినిపించే పేరు యోగి వేమన. ఆయన అంతలా తత్వవేత్తలా మారడానికి కారణాలే, ఇప్పుడు మనం రూపొందించబోయే మినీ మూవీ కథ.. యోగి వేమన.
తొలి తెలుగు కవయిత్రి
కుప్పాంబిక
ప్రతీ యుగం ఒక మార్పుతో గుర్తింపును పొందుతుంది. పురుషాధిపత్యం ఉన్న యుగంలోనూ, స్త్రీ స్వరం మౌనాన్ని చెరిపి వెలుగులా వ్యాపించినప్పుడు, అదే యుగం చరిత్ర అవుతుంది. అలాంటి చరిత్రను సృష్టించిన పేరు, కుప్పాంబిక.
ఆమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు;
ఆమె మాటలతోనే తొలి సారిగా తెలుగు భాషలో మహిళా గొంతుకను వినిపించిన ఒక విప్లవ గీతిక. ఆ కాలంలో ఆడవాళ్లకు అక్షరాలు నేర్చుకునే అదృష్టం లేదు. చదువుకునే అదృష్టమూ లేదు. అలాంటి కాలంలో కుప్పాంబిక, అక్షర చైతన్యమైంది. ఆమె భావాలు ఆలోచనలు రేకెత్తించాయి. కుప్పాంబిక, మహా వీరుడు గోన గన్నారెడ్డి చెల్లెలు, కానీ తన వ్యక్తిత్వం పై మాత్రం ఎవరి ప్రభావం లేదు. స్వయం ప్రకాశిగా వెలిగింది. రాజవంశంలో పుట్టినా రాజ్యాలేలాలని అనుకోలేదు కానీ, రాణిగా పరిపాలించగల సత్తా తనలో ఉందని నిరూపించింది. సాహిత్యంలో తొలి తెలుగు మహిళగా చరిత్రలో స్థానం సంపాదించింది. తన పద్యం చిన్నదే కావచ్చు, కానీ దానిలోని భావం, యవ్వనపు తపన, సిగ్గు, స్త్రీ హృదయ మధనాన్ని అంత అద్భుతంగా చెప్పగలిగింది.
ఆమె “నవజాతాంబకుడేయు సాయకములన్...” అనే పద్యం స్త్రీ మనసులోని భావనలను ప్రపంచానికి పరిచయం చేసింది. అది ప్రేమ కాదు, అది మౌనం కాదు, అది స్త్రీ తన మనసును తానే అర్థం చేసుకునే ప్రయత్నం.
భర్త మల్యాల గుండదండాదీసుడు మరణించిన తర్వాత, ఆమె కన్నీళ్లను దుఃఖంగా కాకుండా, ధర్మంగా మార్చుకుంది. ఆమె రాణిగా పరిపాలించింది, చెరువులు తవ్వించింది, ఆలయాలు నిర్మించింది. అది కాలానికి మించి, ఆలోచనకు మించి, స్త్రీ స్వాతంత్ర్యం ఎలా ఉండాలో చూపిన ఒక ఉదాహరణ.
ప్రపంచం ఇప్పుడు "women empowerment" అనేది నేర్చుకుంటోంది, కానీ 13వ శతాబ్దంలో కుప్పాంబిక అది చేసి చూపింది. ఆమె ఆలోచనల్లో భయం లేదు, భావాల్లో బలం ఉంది, కవిత్వంలో ప్రేమ ఉంది, మాటల్లో ఆత్మగౌరవం ఉంది.
చరిత్ర లో అజరామరంగా మిగిలిపోయే కుప్పాంబకి ఒక చక్కటి కవయిత్రి. ఆమె అన్నయ్య గోన గన్నారెడ్డి మహావీరుడు గా మిగిలిపోయాడు. కుప్పాంబిక అక్షర ప్రేమికురాలిగా, కవయిత్రిగా మిగిలింది. ఆమె కలం, ఆమె ధైర్యం, ఆమె కవిత్వం.. తెలుగు భాషకు తొలి స్వరాన్నిచ్చిన వాక్యాలుగా నిలిచిపోయాయి. ఇది కేవలం ఒక మహిళ కథ కాదు, ఇది ప్రతి స్త్రీ అంతరంగం ఆవిష్కరించినప్పటి కథ. కుప్పాంబిక అనేది పేరు కాదు, అది తెలుగు స్త్రీ ఆత్మకవిత్వానికి పుట్టిన సూర్యోదయం.
Rani Kuppambika
Rani Kumidini Devi
రాణి కుముదినీ దేవి
రాణి కుముదినీ దేవి... ఆమె పేరు ఒక రాజవంశపు గౌరవం మాత్రమే కాదు, ఒక మానవతా దీప్తి. తండ్రి నిజాం రాజ్యంలో ఉపప్రధాని, అమె భర్త వనపర్తి సంస్థానాధిపతి, ಅಯನಾ ఆమెకు అధికార కిరీటం కంటే, సేవా తత్పర ఎక్కువ. ఆమెకు ఆభరణం కరుణ. ఆమెకు అలంకరణ మానవత్వం. హైదరాబాద్ మొదటి మహిళా మేయర్ గా నగరానికి సొబగులు అద్దింది ఆమె. అంతకంటే గొప్పగా, కుష్టు రోగుల జీవితాల్లో వెలుగులు నింపినది ఆమె. సంస్థలు, ఆశ్రమాలు, విద్యాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.
కుముదినీ దేవి గారి కథ అంటే, అధికారంలో ఉన్నప్పుడు కూడా దయను మర్చిపోని స్త్రీ కథ. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. మానవత్వం నిలబెట్టిన ఒక స్త్రీ చరిత్రను మనం తెలుసుకోబోతున్నాం. ఆమెకు పుట్టుకతో వచ్చిన హోదా రాణి, కానీ ఆమె సంపాదించిన హోదా మానవతా దేవతా మూర్తి. ఒక చేతిలో అధికారం, మరో చేతిలో సేవ. అందుకే ఆమె పేరు రాణి కుముదినీ దేవి . ఆమె పాలన, ఆమె చరిత్ర, తరతరాలు నేర్చుకోవాలసిన పాఠం. అందుకే మినీ మూవీగా ఆమె జీవితచరిత్రకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నం.
-అపర చాణక్యుడు – శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి
అందరూ ప్రతి విషయంలో ఒకే విధంగా ఆలోచించే ప్రపంచంలో, కొద్ది మంది మాత్రమే భిన్నంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, లోతుగా ఆలోచిస్తారు. అటువంటి అరుదైన మేధావుల వర్గానికే చెందుతారు శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆయన చుట్టూ ఉన్నవాళ్లకు, ఆయన గురించి మాట్లాడాలంటే, ఆయన ఆలోచనా స్థాయికి చేరుకోవాలంటే కూడా ఒకింత సంకోచం కలిగేంత గొప్ప వ్యక్తిత్వం. ఏ దేశానికెళ్లినా, ఏ వేదికపై నిలిచినా, శాంతం, గంభీరం, తన అస్థిత్వాన్ని ఘనంగా ప్రతిబింబించే ధోరణి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డిగారి ప్రత్యేకత. తెలుగువారికి సేవలందించిన మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాదు,
దేశీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన నాయకుడు ఆయన. ఇందుకే ఆయనను చాలామంది అపర చాణుక్యుడు గా పోల్చేవారు. ఏదైనా కీలక చర్చ, నిర్ణయం సమయంలో ఆయన తన టోపీని టేబుల్పై ఉంచితే, అది నిర్ణయం ఖచ్చితమని, పని తప్పకుండా జరిగే సంకేతమని అందరూ అర్థం చేసుకునేంత విశ్వాసాన్ని ప్రజల్లో నింపిన నాయకుడు. మన రాష్ట్ర అభివృద్ధిలో నాగార్జునసాగర్, తుంగభద్ర వంటి దిగ్గజ ప్రాజెక్టులు ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నాయి.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా, తన వ్యక్తిత్వ శక్తి, తన రాజకీయ ప్రతిభను దేశం మొత్తానికి చూపించిన మహానుభావుడు. ఇందిరా గాంధీ వంటి శక్తివంతమైన నాయకురాలి ఎదుట "గెట్ అవుట్" అనే స్థాయిలో ధైర్యంగా నిలబడి,
కాంగ్రెస్ పార్టీకి స్వయంగా బలమైన సందేశం ఇచ్చిన అసలైన సూపర్ పవర్ శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆయనను "కాసుకో" అన్నా, "కాసుకోవద్దు” అన్నా కూడా.. అది తుది మాట. అతడి నిర్ణయం మారదు. అదే ఆయన మహత్తు.
ఇదే ఆయన వ్యక్తిత్వం. ఇదే ఆయన యొక్క మహోన్నత గాథ.
Kasu Brahmananda Reddy
Alwal Bal Reddy
నిజాం పరిపాలనకు కత్తివేటు - "ఆల్వాల్ బాల్ రెడ్డి”
“విదేశీ హఠావో, స్వదేశీ బనావో” అనే నినాదం పోర్బందర్లో మొదట మార్మోగినప్పుడే, ఆ దూరాన తెలంగాణ నందూకూడా పద్నాలుగు ఏళ్ల పసివయసులోనే ఒక ధైర్యవంతుడు తన స్వరాన్ని కలిపాడు. స్వదేశీ ఉద్యమ పిలుపు దేశమంతా లక్షలాది గొంతుల్లో గర్జించగా, తెలంగాణ మట్టిలోంచి వినిపించిన ఈ ఆవేశం, ఈ ఆకాంక్ష, ఈ ఆవేదన గాంధీజీ చెవుల దాకా చేరింది. నిజాం పరిపాలనను ధిక్కరించి, ఖండించి, ఆ అన్యాయాన్ని పటేల్ గారి దాకా వినిపించిన ఉద్యమాలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ ఆల్వాల్ బాల్ రెడ్డి. ఆర్యసమాజ స్ఫూర్తితో నిలిచిన హిందుత్వ వీరుడు ఆయన.
జైళ్లకు బాల్ రెడ్డి అనేది కొత్తేమీ కాదు, అరెస్టులు సాధారణమయ్యాయి. కానీ ఆయన ధైర్యం మాత్రం అసలు తగ్గలేదు. తన తీరు మారలేదు. దేశం కోసం ఆయన చేసిన అహర్నిశ శ్రమ, తెలంగాణ కోసం ఆయన చూపిన అచంచల తపన ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచే విలువలు. ఆయన జీవితం, ఆయన పోరాటం, ఆయన త్యాగం భావితరాలు తెలుసుకోవాల్సిన అపూర్వమైన చరిత్ర.
అదే చరిత్రను అందరికీ చేరేందుకు చేస్తున్న వినయపూర్వక ప్రయత్నమే ఈ మినీ మూవీ. భవిష్యత్తులో ఆయనపై పూర్తి స్థాయి చిత్రాన్ని తెరకెక్కించాల్సిన అవసరం కూడా అంతే ఉంది.
రాములోరి గుడికోసం, స్వయం సేవకుల కోసం
అపర దానకర్ణుడు – “శ్రీ పుల్లారెడ్డి”
దానం అంటే చేతిలో డబ్బు ఉంటే చాలని కాదు; ఎదుటివారి కష్టం తగ్గాలి అన్న హృదయం ఉండాలి. 'కుడిచేతి ఇస్తే ఎడమచేతికి తెలియకూడదు' అన్న మాటను ఆచరణలో చూపించిన మహాదాతృలోకుడు, శ్రీ పుల్లారెడ్డి గారు.
రాములోరి గుడి కోసం పోరాటం జరుగుతున్నప్పుడు, “రాములోరి భూమి రాములోరికే రావాలి. గుడి కట్టాలి” అని అన్న ఆయన, తన ఆస్థులు అమ్మినా సరే, అవసరమైతే ఏడు లక్షలు కాదు, ఎన్ని లక్షలైనా నేను ఇస్తానంటూ అశోక్ సుంఘాల్ గారికి విరాళం అందించారు. అది ఒక మహర్దానం, ఒక మహోన్నత హృదయం.
“పడిలేచే అల కాదు నాకు భయం... ఎన్నిసార్లు పడినా పైకి లేస్తాననే నమ్మకం” అనే ధైర్యంతో వృత్తిని శోధించుకొని, వ్యాపారాన్ని నిలబెట్టి, వేల కుటుంబాలకు ఊరట ఇచ్చిన పెద్ద మనసున్న వ్యక్తి, శ్రీ పుల్లారెడ్డి గారు.
స్వయం సేవకుల కోసం, వారి భవిష్యత్తు కోసం, ధర్మం నిలబెట్టటానికి చేసిన
ఆయన సేవలు యుగయుగాలూ గుర్తుండాల్సిందే.
అందుకే ఆయన కోసం ఈ మినీ-మూవీ.
G. Pulla Reddy
Konda Venkata Ranga Reddy (KV RANGA REDDY)
తెలంగాణా పోరాట యోధుడు - K.V. రంగా రెడ్డి
తెలంగాణా ప్రాంత విముక్తికోసం, ప్రత్యేక తెలంగాణా స్వప్నం కోసం, భారతదేశంలో హైదరాబాద్ విలీనాన్ని సాధించడంలోనూ తనదైన పోరాట శైలిని ప్రదర్శించిన మహా యోధుడు కండా వెంకట రంగా రెడ్డి.
ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఆయన పోరాట పద్ధతి, ఆయన దూరదృష్టి, పూర్తిగా భిన్నమైనవి. అలాంటి అజరామరమైన వ్యక్తి చేసిన త్యాగాలు, సాగించిన ఉద్యమాలు ఈ తరం ప్రజలకు అవగాహన కావాల్సిన అవసరం ఉంది.
అందుకే, ఒక సినిమా రూపంలోనో, లేదా వెబ్ సిరీస్ రూపంలోనో, ఒక
భిన్నమైన ఫార్మాట్లో ఈ మినీ మూవీగా అందించే ప్రయత్నం...
ఈ ఉరిమే ఉరుము కొండా వెంకట రంగా రెడ్డి, సినాప్సిస్.
న్యాయవ్యవస్థకు పరుగులు నేర్పిన -JUSTICE SUBHASHAN REDDY
దేశంలోనే కాదు, ఘట్టంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలోనూ న్యాయవ్యవస్థకు వేగం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చి, ఫాస్ట్-ట్రాక్ తీర్పుల పరంపరను నెలకొల్పి, “పేదవాడికి చట్టం కఠిన శిక్షలా కాకూడదు, న్యాయం కావాలి” అన్న తత్వంతో న్యాయవ్యవస్థకు కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు శ్రీ జస్టిస్ సుభాషణ్ రెడ్డి.
ఒక తెలుగోడిగా తెలంగాణా పేరును, తెలుగు జాతి ప్రతిభను ఇతర రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల్లో చాటిన గొప్ప న్యాయమూర్తి ఆయన. సుప్రీం కోర్టులో తన గళాన్ని వినిపించి, తన శైలిని నిరూపించి, “అదే కదా నిజమైన న్యాయమూర్తి!” అనిపించేలా తన మార్కును చూపించిన వ్యక్తిత్వం.
కొద్ది కాలంలోనే 50 వేలకుపైగా కేసులను పరిష్కరించి, తన నిర్ణయాల స్పష్టతతో, ధైర్యంతో, వేగంతో న్యాయవృత్తిలో “అద్భుతం” అనే ముద్ర వేసిన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్,
లోకాయుక్త స్థాయిలోనూ తనదైన శైలిలో జెట్ స్పీడ్లో వేల కొద్దీ కేసులను పరిష్కరించిన అపూర్వ న్యాయవాది, న్యాయమూర్తి.
అటువంటి అద్భుతమైన వాక్చాతుర్యం, కర్తవ్యపరత, ధైర్యం కలిగిన మహానుభావుడు గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
అందుకే, ఒక సినిమాగా గానీ, లేదా వెబ్ సిరీస్ గా గానీ ప్రత్యేక ఫార్మాట్లో మినీ మూవీ రూపంలో అందించేందుకు చేస్తున్న ప్రయత్నమే...
“ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్ కు కేర్ ఆఫ్ — జస్టిస్ సుభాషణ్ రెడ్డి” సింహావలోకనం.
Justice Subhashan Reddy
Marri Chenna Reddy
తెలంగాణా పోరు సింహం - మర్రి చెన్నారెడ్డి
తెలంగాణా పోరు సింహం
మర్రి చెన్నారెడ్డి
ఒకప్పటి కాకతిరాజుల పాలన తర్వాత వచ్చిన తెల్లోళ్లు, వాళ్ల తర్వాత వచ్చిన ముస్లిమ్ పాలకులు, .. ఏమైతే ఏంటి, ఐక్యత లేకుండా దాయాదుల మధ్య పోరాటాలతో సొమ్మసిల్లి పోయిన తెలంగాణాను అక్కున చేర్చుకునే వాళ్లు లేకపోయారు. జల్ జంగల్ జమీన్ అంటూ వచ్చిన కొమరం భీమ్ లాంటి వాళ్లతో పాటుగా తెలంగాణాను కాపాడుకునే ప్రయత్నంలో చాకలి ఐలమ్మ లాంటి మహిళలు కూడా కొన్ని వందల మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసారు. రజాకార్ అనే రాక్షస జాతిని సమూలంగా నిర్మూలించాలి. మన పాలన మనమే చేసుకోవాలి అనే అనేకవేల గొంతుకలలో ఒక గొంతు మారు మోగింది. తెలివైన విద్యార్ధి, చిన్న వయసులోనే డాక్టర్ అయ్యాడు. అటువంటి స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఇటు తెలంగాణా పోరులోనూ తనదైన మార్కు వేసుకున్న ఒక చురుకైన యువకుడు, దేశ ప్రధానులను సైతం తన మాటలతో, తన చేతలతో భయపెట్టిన రాజకీయ దురంధరుడు, తను అనుకుంటే చాలు తెలంగాణా 1956 లోనే వచ్చేది అని ఖ్యాతిని కూడగట్టుకున్న ధీరోదాత్తుడు, సాక్షాత్ ఇందిరాగాంధీ బామాలి, బతిమిలాడితే తన పార్టీని విలీనం చేసి జాతి
క్షేమం కోసం మౌన మునిలా మారిన మహానేత శ్రీ మర్రి చెన్నారెడ్డి.
మేనమామ వెంకటరంగారెడ్డి బాటలో నడిచిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన మామంచి నేత శ్రీ చెన్నారెడ్డి. వికారాబాద్ తో పాటు, హైదరాబాద్ ని అభివృద్ధి బాటలో నడిపించిన మాగొప్ప నేత శ్రీ చెన్నారెడ్డి గారు తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటూ... చంద్రుడికో నూలుపోగులా... ఆయన గురించిన చరిత్రను చెప్పే ప్రయత్నమే ఈ మినీ మూవీ.
అపర దానకర
రాజాబహదూర్ వెంకటరామారెడ్డి
దేశం మొత్తం అతలాకుతలంగా వున్న వేళ.. తెలంగాణాలో హైదరాబాద్ సంస్ధానాన్ని తమ జాగీరుగా చేసుకుని నిజాంలు పరిపాలిస్తున్న వేళ, ఒక వైపు దాష్టీకం చూపించే తెల్లదొరలు, మరో వైపు నిరంకుశ రజాకార్లు.. స్వాతంత్ర్య పోరాటపు అల్లర్లు.. అస్తవ్యస్తంగా వున్న తెలంగాణాలోని హైదరాబాద్ లో అప్పుడే ఒక మెరుపు మెరిసింది. ఒక నగారా మోగింది.
ఎప్పుడు ఏమవుతుందో తెలీని పరిస్థితిలో వున్న తెల్లోళ్లు తుళ్లిపడేలా చేసి, నిజాములు అబ్బురపడేలా వారితోనే రాజాబహుదూర్ అని బిరుదు పొందిన ఆయనే రాజా బహదూర్ వెంకట రామారెడ్డి. హైదరాబాద్ కి మొదటి కొత్వాల్. అంటే హైదరాబాద్ ఫస్ట్ కమీషనర్ ఆఫ్ పోలీస్.
తమతోనే వుంటూ తన వాళ్లను కాపాడుకుంటూ తమతో శెహభాష్ అనిపించుకున్న రాజావెంకటరామారెడ్డి తెగువ తెలివితేటలు చూసిన ఏడవ నిజాంకానీ, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హైదరాబాద్ సందర్శించినప్పుడు సురక్షితంగా మళ్లీ పంపించడంతో అటు బ్రిటిష్ వాళ్లు కానీ.. ఆయనను చూసి గర్వపడ్డారు.
తెలంగాణాలో మొదటి రెడ్డి హాస్టల్ ని కట్టిఎందరో పిల్లలకు ఆపన్నహస్తంగా మారాడు. ఒకటా రెండా, తెలంగాణాలో ఎన్నో ఎన్నెన్నో విద్యాసంస్ధలు
నిర్మించి, పోషించి, ఎన్నో కుటుంబాలకు జీవితాల్ని ప్రసాదించిన అసామాన్య మానవ మాధవుడు శ్రీ రాజాబహుదూర్ వెంకటరామా రాడ్డి. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన అభిమతం ఒక ఆకుపచ్చని సంతకం. ఆయన ఒక చరిత్ర. ఆయన ఒక వ్యవస్థ. సరస్వతీదేవికి పట్టం కట్టిన మహామనిషి రాజాబహదూర్ వెంకటరామారెడ్డి గురించి మినీ మూవీ ఇది.
Raja Bahadur Venkata Rama Reddy
Agaram Subbarayalu Reddiar
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చెరగని సంతకం..
అగరం సుబ్బరాయలు రెడ్డియార్.
బ్రిటిష్ పాలన కాఠిన్యంలో, ప్రజల మాటకు విలువే లేని కాలంలో, "సేవకుల చేతిలోనే సర్కారు ఉండాలి" అనే ఆలోచనతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. లండన్లో న్యాయశాస్త్రం అభ్యసించి తిరిగివచ్చినా, ఆయనకు పదవులు, పరాక్రమం కన్నా సేవామార్గం ముఖ్యమైంది. కడలూరు తాలూకా బోర్డులో మొదలైన సేవా యాత్ర, దక్షిణ ఆర్కాట్ జిల్లా పాలనలో క్రమంగా విస్తరించింది. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం ఆయనకు కర్తవ్యమే కాదు, బాధ్యత గా భావించారు. ఆయన దృష్టిలో పరిపాలన అంటే అధికార ప్రదర్శన కాదు.. సేవ చేసే అదృష్టం. 1920లో జస్టిస్ పార్టీ విజయం తర్వాత, లార్డ్ విల్లింగ్టన్ పిలుపుతో మద్రాసు ప్రెసిడెన్సీకి తొలి ప్రజాస్వామ్య మంత్రిగా ఆయన పదవీ స్వీకారం చేశారు. ఆయన చేసిన సంస్కరణలు ఎన్నో వున్నాయి. వాటికి సంబంధించిన చరిత్రే ఈ పుస్తకం. ఆయన ఆలోచనల వెలుగును మళ్లీ ఆవిష్కరించే ప్రయత్నం. ప్రజాస్వామ్యానికి పునాది వేసిన ఆ మహామనిషికి ఇది ఒక నివాళి. ఒక మినీ మూవీ రూపంలో, ఒక మహా స్ఫూర్తి రూపంలో.
ప్రీమియర్ ఆఫ్ మద్రాస్
ఒమందూర్ ధర్మనాయకులు - శ్రీ OP రామస్వామి రెడ్డియార్
మంచి చెడులను బేరీజు వేసుకుంటూ పోయినా కేవలం తమ ఉనికి కోసం పాకులాడేవాళ్లు చాలా మంది కనిపిస్తారు. కానీ, సమాజ శ్రేయస్సు కోసం, భవిష్యత్ తరాల క్షేమం కోసం ఆలోచించే వాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి అరుదైన నాయకుల్లో మొదటి వరుసలో ఉండే వారు శ్రీ ఒమండూర్ రామస్వామి రెడ్డియార్ గారు. అయన రెడ్డి కులంలో పుట్టినా కూడా ఎప్పుడూ కులం గురించి, మతం గురించి ఆలోచించకుండా సమాజం కోసం ఆలోచించేవారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా నాయకుడిగా చట్టాల్లోనూ, సమాజంలో గొప్ప గొప్ప మార్పులు తెచ్చిన మహనీయుడు ఆయన. జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మఠాలు మరియు దేవాలయాల ఆస్తులను దోపిడీ చేయకుండా నిరోధించడానికి కఠిన చట్టాలను తీసుకువచ్చాడు. అలాగే జమీందార్ ఇనాం వ్యవస్థ, దేవాదాసీ చట్టాల రద్దు వంటి గొప్ప సంస్కరణలు చేశాడు అలాగే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశాడు. ఆయన గురించిన మినీమూవీకి సంబంధించినదే ఈ స్క్రిప్ట్.
O. P. Ramaswamy Reddiar
V. Venkata Subba Reddiar
“పుదుచ్చేరి స్వాతంత్ర్య గాథలో అజరామర వీరుడు
వి. వెంకట సుబ్బా రెడ్డియార్”
భారత స్వాతంత్ర్య చరిత్ర అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై మాత్రమే కాదు. అది తూర్పు తీరం మీద పుదుచ్చేరి నేలలో రాసిన రక్తకథ కూడా. ఆ చిన్న భూభాగం మీద ఫ్రెంచ్ జెండా ఎగురుతూ ఉండగా, దాని కింద ఒక తెలుగు హృదయం ఆవేశంతో కొట్టుకుంది, ఆ హృదయం పేరు వి. వెంకట సుబ్బా రెడ్డియార్.
ఆయన ఫ్రెంచ్ అధికారుల ముందర నమస్కరించలేదు. ప్రజలకు మాత్రమే నమస్కరించాడు. పాండిచ్చేరి గల్లీల్లో మొదలైన ఆయన తిరుగుబాటు ఆ తర్వాత స్వాతంత్ర్య జ్వాలగా మారింది. పట్టణంలో ఫ్రెంచ్ సైనికులు నడుస్తుంటే, పల్లెల్లో “భారత మాతా కి జై" నినాదాలు మార్మోగించేవాడు ఈ వీరుడు. తన చేతుల మీద కాలిన మచ్చలున్నా, హృదయంలో జ్వాల అరిగిపోలేదు. ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఒకచోట చేర్చి, “మన నేల మనదే కావాలి” అన్న ఆయన గళం పుదుచ్చేరి స్వేచ్ఛా ఘోషగా మారింది.
1946లో మొదలైన ఆయన పోరాటం, 1954 అక్టోబర్ 13న విజయ శిఖరాన్ని అందుకుంది. పాండిచ్చేరి భారత యూనియన్లో విలీనమైంది. అది కేవలం రాజకీయ మార్పు కాదు, ఒక ఆత్మ గెలుపు. ఒక మనిషి విశ్వాసం, ధైర్యం, ధర్మం కలిసి సాధించిన స్వరాజ్యం.
తరువాత అదే నాయకుడు, ఆ నేలకే రెండవ ముఖ్యమంత్రిగా ఎదిగి, మళ్లీ ప్రజలకోసం పాలనను అంకితం చేశాడు. పాలన అంటే అధికారమని కాదు, బాధ్యతని
నిరూపించాడు. దేశం కోసం కష్టపడ్డ ఆయనలాంటి నాయకులే భారత స్వాతంత్ర్యానికి నిజమైన స్థంభాలు. పుదుచ్చేరి విముక్తి వెనుక నిలిచిన ఆ ధృడమైన నీడ ఇవాళ కూడా ప్రతి ఇంటి గోడలపై ఆయన చిత్రంలో కనిపిస్తుంది. అది చరిత్ర కాదు,అది జాతి గర్వం. వారి మనుగడలో కలిసిపోయిన సిద్దాంతం.
ఈ చిత్ర యాత్రలో, మనం చూస్తామన్నీ ఆయన చూపిన మార్గమే, విముక్తి కోసం కదిలిన అడుగులు, ప్రజల నిమిత్తం మండిన దీక్ష, మరియు... స్వేచ్ఛ కోసం ప్రాణం పెట్టిన ఒక మనిషి గాధ.
“వి. వెంకట సుబ్బా రెడ్డియార్ గారి జీవితం, పుదుచ్చేరి స్వాతంత్ర్య పుటల్లో ఒక అజరామర సాక్ష్యం.” అందుకే ఆయన గురించిన ఈ మినీ మూవీ.రాబోయే తరాలకు కచ్చితంగా స్ఫూర్తిగా నిలుస్తుంది.
స్వాతంత్ర్య సమరయోధుడు, మైసూర్ (కర్ణాటక) రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి,
శ్రీ క్యాసంబల్లి చెంగలరాయ రెడ్డి
“కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు... స్వాతంత్య్రానంతర భారతం ఎలా ఉండాలో రూపుదిద్దిన నాయకుడు ఆయన శ్రీ క్యాసంబల్లి చెంగలరాయ రెడ్డి.”
దేశం కొత్తగా స్వేచ్ఛను అందుకున్నప్పుడు, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రజలకు తెలియని సమయం. ఆ సందిగ్ధతలో ప్రజలతో నడిచి, ప్రభుత్వానికి రూపం ఇచ్చిన మొదటి శిల్పి ఆయన. రైతు బిడ్డగా పుట్టి, విప్లవవాది, సంఘటకుడు, ప్రజా నాయకుడుగా ఎదిగాడు. కోలార్ నేలలో పుట్టిన ఆ సాదాసీదా యువకుడు, విద్యతో పాటు ధర్మాన్ని నేర్చుకున్నాడు.
ప్రజల కష్టాలను, ఆకలిని, పేదరికాన్ని గమనించి.. “ప్రజల పరిపాలన కోసం ప్రజలే పాలకులు కావాలి” అనే సిద్ధాంతంతో పీపుల్స్ పార్టీని స్థాపించాడు. అతని ఉద్యమాలు రైతు ఊళ్ళలో మొదలై, మైసూర్ సభల వరకు మారుమ్రోగాయి.భారత స్వాతంత్ర్యం తర్వాత, కర్ణాటక రాష్ట్రం పునాది వేయడంలో ఆయన పాత్ర అపారము.
1947 అక్టోబర్ 25న మైసూరు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన క్షణం.. దక్షిణ భారత ప్రజాస్వామ్య చరిత్రలో బంగారు అక్షరాలతో
నిలిచిపోయింది. ప్రజా శ్రేయస్సు, రైతు క్షేమం కోసం పాటుపడ్డారాయన. ఒక రాష్ట్ర పునాదులను పటిష్ఠంగా నిర్మించడంలో తన దైన శైలి కనబర్చిన మహానాయకులైన శ్రీ చెంగల్రాయ రెడ్డి గారికి ఘన నివాళి ఘటిస్తూ, ఆయన గురించి నిర్మించే ఈ మినీ మూవీ భావి తరాలకు స్ఫూర్తిమంత్రమౌతుందని నమ్ముతూ...
K. Chengalaraya Reddy
Each story is built with:
Historical accuracy
Archival research
Culture-rich storytelling
Cinematic narrative structure
Character depth and emotional impact
These stories will introduce India’s unsung heroes to the world.